'అమ్మవారి చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపై ఉండాలి'
NGKL: ఆ దుర్గమ్మ చల్లని చూపు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నిన్న అమ్రాబాద్ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అమరేశ్వర స్వామి దేవాలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మహిళలతో ఆయన బతుకమ్మ ఆడి సందడి చేశారు.