పాక్ కాల్పులు.. బుద్ధి చెప్తున్న భారత్

సరిహద్దులో పాక్ కాల్పులు జరుపుతున్న వేళ ఆ దేశానికి బుద్ధి చెప్పేందుకు భారత్ ఆర్మీ సిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. రఫీఖ్వి, మురీద్, చాక్లాల, సుక్కర్, చునియాన్ సైనిక స్థావరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. పస్రూర్‌లోని రాడార్ స్టేషన్, సియార్‌కోట్‌లోని ఎయిర్ బేస్‌పై దాడి చేసి వాటిని నేలమట్టం చేసింది.