టేకు దుంగలు పట్టివేత.. నిందితుడికి రిమాండ్

టేకు దుంగలు పట్టివేత.. నిందితుడికి రిమాండ్

ASF: తిర్యాని మండలం గిన్నె దారి రేంజ్ పరిధిలోని పంగిడి మధుర బీట్ నుంచి టేకు దుంగలను అక్రమంగా తరలించిన గోపెర నాగ గూడాకు చెందిన పెందోర్ శంకర్‌ను పట్టుకున్నట్లు ఫారెస్ట్ అధికారి సరోజిని తెలిపారు. మంగళవారం సిర్పూర్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి అతడికి 14 రోజుల రిమాండ్ విధించారన్నారు. ఇవాళ శంకర్‌ను ఆసిఫాబాద్ జైలు తరలించినట్లు ఆమె వెల్లడించారు.