వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

JGL: ధర్మపురి నృసింహుడి క్షేత్రంలో వైభవంగా నృసింహ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం 8వ రోజు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పూలతో స్వామివారిని అలంకరణచేసి, హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ గావించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.