VIDEO: కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల నిరసన

VIDEO: కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల నిరసన

SRPT:- సూర్యాపేటలోని కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తలు సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిభారం తగ్గించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని పలువురు ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.