ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: మాజీ ఎమ్మెల్సీ
VSP: కూటమి హయాంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. జీవీఎంసీ 54వ వార్డు సూర్య నగర్లో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వినతులు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యమిస్తోందన్నారు.