ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు
HNK: ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన గుర్రం శ్రీకాంత్‌కు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నేడు గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. DCC అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శనివారం ఈ నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇంటిని ప్రారంభించారు. పేదోడి సొంతిటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు.