రైల్వే స్టేషన్‌లో రాపిడో పిక్అప్ పాయింట్

రైల్వే స్టేషన్‌లో రాపిడో పిక్అప్ పాయింట్

విశాఖ రైల్వే స్టేషన్‌లో రాపిడో పిక్అప్ పాయింట్ ప్రారంభించారు. ఈ మేరకు డీఆర్ఎం లలిత్ బిహ్రా జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రయాణీకుల శీఘ్ర రవాణ, సౌకర్యార్థం ఈ పిక్అప్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, మహిళా ప్రయాణీకుల కోసం విమెన్ రైడర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.