విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

కృష్ణా: ఉంగుటూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, మధ్యాహ్నం భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే పాఠ్య పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని సూచించారు.