విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

PDPL: ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా, ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మాదకద్రవ్యాల ముప్పు, నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు మాదకద్రవ్యాల నుంచి ఎలా దూరంగా ఉండవచ్చు అనే అంశాలపై ఈ వ్యాసరచన పోటీలు నిర్వహించారు.