VIDEO: బాల్యవివాహం నిర్మూలనకు ప్రతిజ్ఞ
GNTR: శిశు-మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి రవిబాబు పాల్గొన్నారు.