మద్యం తాగి పట్టుబడ్డ వ్యక్తికి 10 రోజుల జైలు

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఒకరికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ గురువారం తీర్పు చెప్పారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. బోర్గాం(పి) కు చెందిన చామకూర లక్పతి తరుచూ మద్యం తాగి వాహనం నడుపుతూ ఇప్పటికీ 3 సార్లు పట్టుబడిన నేపథ్యంలో 10 రోజుల జైలు శిక్ష విధించారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.