భార్యపై దాడి చేసిన హోంగార్డు అరెస్ట్: CI

PDPL: గోదావరిఖనికి చెందిన ఆవుల గట్టయ్య హోంగార్డు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తన భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వేధించేవాడు. ఈ విషయాన్ని నిలదీయడంతో భార్య రామలక్ష్మీ పై దాడి చేశాడు. ఘటనపై రామలక్ష్మీ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హోంగార్డును అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ CI రవీందర్ తెలిపారు.