VIDEO: తొలిసారి ఓసీ మహిళకు పీఠం
SRPT: మేళ్లచెరువు చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. నూతన సర్పంచ్‌గా బచ్చు పద్మ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఓసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా సర్పంచ్ పదవిని అధిష్టించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో బీసీ మహిళ రిజర్వేషన్ కింద ఎస్.శివపార్వతమ్మ సర్పంచ్‌గా పని చేశారు.