ఉంగుటూరు పీపీసీలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ
ELR: ఏలూరు ఆర్డీఓ అంబరీష్ శుక్రవారం ఉంగుటూరు రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆయన కొనుగోలు చేసిన ధాన్యం సంచులను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమంది రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆవరణలో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, రైతుల సమస్యలపై మాట్లాడారు.