అస్వస్థతకు గురైన నెమళ్లు.. అధికారులకు అప్పగింత

CTR: పుంగనూరు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో అస్వస్థతకు గురైన రెండు నెమళ్లను ఆదివారం ఉదయం ఓ రైతు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. చండ్రమాకులపల్లి బీట్ ఆఫీసర్ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పుంగనూరులోని పశువైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు.