VIDEO: 'రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పూర్తికి చర్యలు'
ADB: జిల్లా కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వచ్చే ఏప్రిల్, మేలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా, రైల్వే, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షించారు. శరవేగంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.