కేజీబీవిలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

ప్రకాశం: యర్రగొండపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో గురువారం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులందరికీ ముందస్తు జాగ్రత్తతో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న 262 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు.