అంకొలిలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

అంకొలిలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

ADB: ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో అంకొలి గ్రామంలో నిర్వహించిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం గురువారంతో ముగిసింది. చివరిరోజు గ్రామ రైతు వేదికలో రైతు అవగాహనసదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మల్లేష్ పాల్గొని ఉద్యాన పంటల పెంపకం ప్రాముఖ్యత, లాభాలు గురించి నూతన ప్రవర్ధన విధానాల గురించి వివరించారు.