మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న నూతన చెత్త డబ్బాలు

ప్రకాశం: కనిగిరి పట్టణంలో చెత్త సేకరణ కొరకు మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ నూతన చెత్త డబ్బాలను, ట్రాలీ బండ్లను తెప్పించారు. పట్టణంలో పలుచోట్ల ఉన్న చెత్త డబ్బాలు చెడిపోయాయని వాటి స్థానంలో నూతన చెత్త డబ్బాలు పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఇళ్లలో వచ్చే చెత్తను రోడ్డుపైన వెయ్యొద్దని నూతనంగా ఏర్పాటు చేసిన డబ్బాలలో వేయాలన్నారు