'టీజీవో సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి'

'టీజీవో సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి'

PDPL: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం భవనం నిర్మాణం కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్, కార్యదర్శి లెంకల బ్రహ్మనంద రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.