బాధిత రైతుకు నష్టపరిహారం ఇవ్వాలి: రమేష్ రాథోడ్
ASF: కెరమెరి మండలానికి చెందిన రైతు షేక్ ముస్తఫాకు చెందిన రెండు ఎద్దులు 7 నెలల క్రితం విద్యుత్ షాక్‌తో మరణించాయి. దీంతో నష్టపరిహారం కోసం సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడంతో NHRC జిల్లా ఛైర్మన్ రమేష్ రాథోడ్ గురువారం వరంగల్ NPDCL కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు సమర్పించారు. త్వరలో బాధిత రైతులు రూ.80 వేల నష్టపరిహారం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.