ఢిల్లీ పేలుడుతో బీజేపీకి సంబంధం ఉందా.?: కాంగ్రెస్ మంత్రి
ఢిల్లీ పేలుడు ఘటనపై కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరగటంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన నిందింతులకు రాజకీయ సంబంధాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్లవచ్చని చెబుతున్న నేపథ్యంలో ఈ సందేహం తలెత్తినట్లు చెప్పారు.