VIDEO: ఆమదాలవలసలో హైటెన్షన్.. రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు
SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆమదాలవలసలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం సాయంత్రం వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పీడీ యాక్ట్ అమలలో ఉన్నందున పోలీసులు-నాయకులు మధ్య వాగ్వాదం జరిగింది.