రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రకాశం: సింగరాయకొండలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. లారీ అసోసియేషన్ కార్యాలయం సమీపంలో కంకర లోడుతో వస్తున్న లారీ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో ఆ వ్యక్తి  అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.