వినుకొండలో దాబాలపై ఎక్సైజ్ దాడులు

వినుకొండలో దాబాలపై ఎక్సైజ్ దాడులు

PLD: వినుకొండ పట్టణంలోని దాబాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రధాన రహదారుల వెంట ఉన్న హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. బహిరంగంగా మద్యం తాగడం నేరమని, దాబా హోటళ్లలో మద్యపానం నిషేధమని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.