రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు

VSP: కశింకోట మండలం బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బయ్యవరం వద్ద లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు త్రీవంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.