పుంగనూరులో రేపు ఉచితంగా కంటి పరీక్షలు
అన్నమయ్య: పుంగనూరు పట్టణంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కంటి పరీక్షలు చేస్తారన్నారు. కంటి పొర, దూరపు చూపు, మెల్లకన్ను, కంటి చూపు తగ్గిన వారికి శిబిరంలో ఉచితంగా చికిత్స అందిస్తామని చెప్పారు.