'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
SRCL: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు. వేములవాడ రూరల్ మండలం ఆచంపల్లి, వెంకటాంపల్లి, నమిలిగుండుపల్లి, చందుర్తి మండలం మూడపల్లి,ఆశిరెడ్డిపల్లి, రామన్నపేట, చందుర్తి, మల్యాల, నర్సింగాపూర్, కిష్టంపేట్, జోగాపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.