VIDEO: సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్రాలు: AO
JN: బచ్చన్నపేట మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై యంత్ర పరికరాలు పంపిణీ చేయనున్నట్లు AO విద్యాకర్ రెడ్డి తెలిపారు. యంత్ర పరికరాలపై SC,ST, మహిళా రైతులకు 50%,మిగతా వారికి 40% సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు క్లస్టర్ AEO ల వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.