'కిలో బియ్యం బదులుగా కిలో రాగులు'

శ్రీకాకుళం: ఆగస్టు నెల నుంచి రేషన్ కార్డుదారులకు ఒక కిలో బియ్యం బదులుగా ఒక కిలో రాగులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలకు పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రాగులను చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు. రాగులు కావాలనుకునే రేషన్ కార్డుదారులు తమ డీలర్‌కు ముందుగానే తెలియజేయలన్నారు.