గ్రీవెన్స్‌లో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

BPT: చుండూరు మండలంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌కు విశేష స్పందన లభించింది. చుండూరు మండలంలోని సొసైటీ బిల్డింగ్ వద్ద ప్రజావేదిక కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.