అప్పుడే బంగ్లాదేశ్‌కు తిరిగొస్తా: షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాలో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆ దేశానికి షరతు పెట్టారు. అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగివెళ్తానని చెప్పారు. కాగా, షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.