దారుణ హత్యకు గురైన రౌడీ షీటర్

దారుణ హత్యకు గురైన రౌడీ షీటర్

CTR: చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అచ్చి ప్రవీణ్(27) అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు బండారు మణిగా గుర్తించారు. కాగా పాత కక్షలే ఈ హత్యకు కారణం అని సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.