రెండు ఎకరాల జీడి తోటలు దగ్ధం
AKP: రావికమతం మండలం టీ. అర్జాపురం పంచాయతీ డోలవానిపాలెంకు చెందిన డోల ఈశ్వరరావుకు సంబంధించి ఆదివారం ఉదయం రెండు ఎకరాల జీడి తోట దగ్ధమైంది. పోడు భూమిలో పది సంవత్సరాల నుంచి ఈశ్వరరావు జీడి తోటలను పెంచుతున్నాడు. అకస్మాత్తుగా మాటలు చెలరేగి పంట కాలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.