ఇరాన్ నౌకా దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాం: ట్రంప్
అమెరికాతో చర్చించేదిలేదన్న ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై దాడులను మరింత పెంచుతామని తేల్చి చెప్పారు. ఇరాన్ నౌకా దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశామని వెల్లడించారు. చమురు ధరలు పెరిగినా మళ్లీ తగ్గుతాయని తెలిపారు. తాము చేసే పని వల్ల ప్రపంచానికే మేలు జరుగుతుందన్నారు. యుద్ధంలో కుర్దిష్ దళాలు దూరంగా ఉండాలని కోరామని చెప్పారు.