పేదల గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ: ఎమ్మెల్యే

NZB: పేదల గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం నగరంలోని గాంధీ చౌక్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్, ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ నాయకులు ఉన్నారు.