భారత్- పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం LOC ప్రాంతాల్లో కాల్పులు జరుపుతుంది. భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతుంది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్బాని అఖూర్ సెక్టార్‌లో కాల్పులకు పాల్పడింది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది.