ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై,బెల్ట్ అందజేత

NLG: వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామ ప్రాథమిక పాఠశాల గ్రామానికి చెందిన సందీప్ సాయ సహకారాలతో 108 మంది విద్యార్థులకు టై బెల్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ... దాతలకు సహకారాలతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. సుమారు 6వేల రూపాయలతో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన దాత సందీప్‌ను ఎంఈవో అభినందించారు.