దేశంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అదే!
క్లైమేట్ ట్రెండ్స్ అధ్యయనం ప్రకారం 2024-25లో ఢిల్లీ దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఇక్కడ PM2.5 స్థాయిలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పాట్నా రెండో స్థానంలో ఉంది. గతంలో స్వచ్ఛమైన గాలి ఉన్న బెంగళూరు, చెన్నై, ముంబైలో కూడా కాలుష్యం పెరుగుతుండటం ఆందోళనకరం. ఈ కాలుష్య సగటు పెరుగుదల వల్ల ప్రజలకు తీవ్ర ఆరోగ్య ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.