మేదరమెట్లలో ప్రమాదకరంగా మారిన లారీలు

మేదరమెట్లలో ప్రమాదకరంగా మారిన లారీలు

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని జాతీయ రహదారి వెంబడి ఆగి ఉన్న లారీలు ప్రమాదకరంగా మారాయి. డ్రైవర్లు రోడ్డు మీదే లారీలు ఆపి దాబాల వద్దకు వెళ్లడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందిగా మారిందని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో మరింత ఇబ్బందికరంగా మారిందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.