వేల సంఖ్యలో కోళ్లు మృతి.!
MDK: జిల్లాలో భారీగా కోళ్లు మృతి చెందడంతో పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన నెలకొంది. మిరుదొడ్డి మండలం అందే గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫారంలో సుమారు 7,700 కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతిచెందిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు.