మియాపూర్ బస్ బాడీ యూనిట్ విలీనానికి చర్యలు..!

HYD: మియాపూర్ బస్ బాడీ యూనిట్ వర్క్ షాప్ ఉప్పల్ వర్క్ షాప్‌లో విలీనం చేసే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. మియాపూర్ బస్ బాడీ యూనిట్ 18 ఎకరాల విశాలమైన స్థలంలో కొనసాగుతుంది. ఈ యూనిట్ అక్కడి నుంచి తరలిస్తే అత్యంత విలువైన స్థలాలను లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.