VIDEO: బ్రహ్మోత్సవాలకు విద్యుత్ ప్రభలు ఏర్పాట్లు
మార్కాపురం జిల్లా శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. వివిధ పార్టీలకు చెందిన విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంభం రోడ్డులో జనసేన, అమ్మవారి శాల బజారులో వైసీపీ నాయుడు బజార్లో టీడీపీ విద్యుత్ ప్రభల ఏర్పాటు పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టులు, డాన్సర్లు పాల్గొననున్నారు.