VIDEO: 'నియమాలు తప్పనిసరిగా పాటించాలి'
SDPT: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదని హెచ్చరించారు. డబ్బు మద్యం పంపిణీ కఠినంగా నిషేధించినట్లు తెలిపారు. ప్రచార ఖర్చులను బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎస్సైలు పాల్గొన్నారు.