ఘనంగా షిర్డీసాయి బాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా షిర్డీసాయి బాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని షిర్డీసాయి బాబా ఆలయం 23వసంతాలు పూర్తి చేసుకొని 24వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఎల్లా ప్రగఢ నాగేశ్వరరావు శర్మ, సూర్యనారాయణ శర్మలు ఉదయం నుంచి సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.