VIDEO: హన్మకొండ వెళ్లే ఆ బస్సులన్నీ MGBS నుంచే..!
HYD: హన్మకొండ వెళ్లే రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులన్నీ MGBS నుంచే నడుపుతున్నట్లుగా వరంగల్ రీజియన్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు మొత్తం గమనించాలని సూచించారు. MGBS నుంచి ఉప్పల్ మీదుగా హన్మకొండ వెళ్తాయి. దీనిని బట్టి JBS నుంచి గతంలో ఉన్న సర్వీసులను సైతం MGBS నుంచి స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.