VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
KMR: ఎల్లారెడ్డిలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సందర్శించారు. నిర్వహణ, రికార్డులు, విద్యార్థుల అటెండెన్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బోర్వెల్, భోజన ఏర్పాట్లపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.