హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య

GNTR: హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేకూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని పలకలూరులోని ఓ కళాశాలలో చదువుతోంది. హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లమని తల్లిని కోరగా ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థిని మంగళవారం హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.