వైభవంగా వరకవి సిద్ధప్ప ఆరాధన ఉత్సవాలు
KMR: బిక్కనూరులో వరకవి సిద్ధప్ప రాజయోగి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సిద్ధప్ప ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్య లింగం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిద్ధప్ప రాజయోగి చిత్రపటాన్ని పట్టణ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు